కనిగిరి: లోన్ రికవరీ ఏజెంట్స్ వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు: కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్
కనిగిరి: లోన్ రికవరీ ఏజెంట్స్ లోన్ తీసుకున్న వారిని వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. కనిగిరి పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ... కనిగిరి డివిజన్ పరిధిలోని 9 మండలాల లోన్ రికవరీ ఏజెంట్స్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా నగదు డ్రా చేసే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. RBI నిబంధనలకు అనుగుణంగానే లోన్ రికవరీ ఏజెంట్లు లోను వసూలు చేయాలన్నారు. ఆధార్ కార్డుల ద్వారా నగదు డ్రా చేసి వ్యక్తులకు ఇచ్చేవారు వారి వివరాలను మిస్ యూజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.