ఉరవకొండ: బాలుడిపై ఎలుగుబంటి దాడి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఎలగలవంక గ్రామ సమీపంలో మంగళవారం గొర్రెల కాపరిగా ఉన్న బాలుడు విటల్ పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరులైన వీర దొడ్డప్ప కుటుంబం వలస వస్తు ఎలగల వంక గ్రామ సమీపంలో గత నాలుగు రోజుల క్రితం బస చేశారు. మంగళవారం గొర్రెల మంద సమీపంలోని బొప్పాయి తోటలో కి గడ్డి తీసుకురావడానికి వెళ్లిన బాలుడి పై ఎలుగుబంటి దాడి చేసి ముఖాన్ని మొత్తం చిద్రం చేసింది. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తదుపరి బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి బాలుడిని తరలించి చికిత్సలు అందిస్తున్నారు.