కొండపి: సింగరాయకొండ లోని నవోదయ పాఠశాలలు మృతి చెందిన విద్యార్థి తల్లి మౌలాబి చనిపోయే ముందు వ్యక్తం చేసిన ఆవేదన
కోచింగ్ సెంటర్లో కుమారుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. బిడ్డ పోయిన బాధలోనూ తనలాంటి కష్టం మరో తల్లికి రాకూడదని ఆమె పోరాడారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక తనకు న్యాయం జరగదని భావించి ఆ మాతృమూర్తి విషం తాగింది. ఆసుపత్రికి తరలిస్తే మృతువుతో పోరాడి కన్నుమూసింది. కనిగిరికి చెందిన తౌషిక్ తల్లి విషాదగాథ ఇది. తన బిడ్డ సమాధి పక్కనే తననూ పూడ్చాలని గతంలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు కన్నీరు తెప్పిస్తున్నాయి.