ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐసిడిఎస్ అధికారులు బాల్యవివాహాలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాలు దాటకుండా వివాహాలు చేసుకోవద్దని బాగా చదువుకొని తమ కాళ్ళపై తాగు నిలబడితే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని ఐసిడిఎస్ అధికారులు విద్యార్థినీలకు తెలిపారు. బాల్య వివాహం బలవంతంగా చేసే తల్లిదండ్రులకు మరియు వివాహం చేసుకున్న వ్యక్తికి కూడా చట్టపరంగా శిక్ష అర్హులవుతారని వెల్లడించారు.