ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ బస్టాండ్లను శుక్రవారం స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు కొత్త వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను సేకరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతరం బస్టాండ్ రైల్వే స్టేషన్ లపై నిగా ఉంటుందని ఎస్సై తెలిపారు.