ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో సైడ్ కాలవల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సైడ్ కాలవలు సాయిబాబా గుడి సెంటర్ నుంచి దాస రెడ్డిపాలెం వరకు ఇరువైపులా షాపులు ఉన్నందున షాపుల ఎదురు ఉన్న రేకులు తొలగించడంలో కొంత జాప్యం జరుగుతోంది. మొదలుపెట్టిన సమయంలో షాపుల నిర్వాహకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగిస్తుండడంతో పనులు జరుగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేయాలని షాపుల యజమానులు కాంట్రాక్టర్ను కోరుతున్నారు.