రాయదుర్గం: పేలకు న్యాయం అందడమే లక్ష్యం : జడ్జి ఎం.రమ్య
పేదలు, మహిళలు, పిల్లలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా మండల న్యాయ సేవాధికార సంస్థ(MLSC) పనిచేస్తోందని జూనియర్ సివిల్ జడ్జి ఎం.రమ్య తెలిపారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా సోమవారం రాయదుర్గం కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవల ప్రాముఖ్యతను, లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కరించుకునే విధానం వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవాలన్నారు.