రాప్తాడు: 2014 నుంచి2026 వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సిబిఐ విచారణ చేయాలి. పాపంపేటలో ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు డిమాండ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేట శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం లో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకులను కఠినంగా శి క్షించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులను కలుపుకొని ఆందోళన చేపడతామని ఆర్ పి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు టిడిపి వైసిపి పార్టీలపై విమర్శించారు.