గిద్దలూరు: బేస్తవారిపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా, ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేస్తవారిపేట మండలం చిన్నఓబినేని పల్లి గ్రామానికి చెందిన దొడ్డ రామిరెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బేస్తవారిపేట నుంచి పెద్ద ఓబినేనిపల్లి గ్రామానికి ఆటో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడినట్లుగా పోలీసులు వెల్లడించారు.