మచిలీపట్నం: రోడ్డుపైకి చేరిన డంపింగ్ యార్డ్ వ్యర్థాలు, తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు
మచిలీపట్నంలో డంపింగ్ యార్డ్ చెత్త రోడ్డుపైకి రావడంతో దుర్గంధం, ఆవులు, పందుల సంచారంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారంతో రోడ్లు నిండిపోయాయని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.