కనిగిరి: కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు రామాపురం సభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
కనిగిరి నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో ఉన్న తీవ్ర ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పారద్రోలేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వరికుంటపాడు మండలం రామాపురం పల్లె పండుగ సభలో మంగళవారం సీఎం మాట్లాడుతూ.. బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ ఏర్పాటు మరియు మౌలిక వసతుల కల్పనకు రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎంకు ఎమ్మెల్యే ఉగ్ర కృతజ్ఞతలు తెలిపారు.