రాయదుర్గం: ఊరిని, గుడిని, బడిని మరవవద్దు : పట్టణంలో మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద తీర్థ స్వామి
బాల్యంలో చదివిన బడి, తిరగాడిన గుడి, జన్మించిన ఊరును మరవవద్దని మైసూరు శ్రీ గురుదత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ విజయానంద తీర్థ స్వామీ అన్నారు. 42 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన ఆయన రాయదుర్గంలోని వివిధ ఆలయాల సందర్శన అనంతరం ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు దశభుజమహాగణపతి వైభవము-ఉపాసనా విధానం పుస్తకావిష్కరణ చేశారు. మనిషి మనిషి గా జీవిస్తే చాలునన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు.