రాయదుర్గం: బొమ్మనహాల్ కెజిబివి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపిసి శైలజ
బొమ్మనహాల్ KGBVలో సమగ్ర శిక్ష APC శైలజ ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి పాఠశాలలో బస చేసి విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతి, భోజనం, ఆరోగ్యాన్ని పరిశీలించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో టాపర్లుగా నిలవాలని సూచించారు. బుధవారం యోగా, అభ్యసన సామర్థ్యాన్ని గమనించి, ఫిర్యాదుల పెట్టె, భోజన మెనూను తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. 100% ఉత్తీర్ణతకు ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్ఓ కమలమ్మ పాల్గొన్నారు.