కనిగిరి: పట్టణంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతం పై టిడిపి శ్రేణులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమావేశం
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి టిడిపి నాయకులు, సోమవారం సమావేశమయ్యారు. ఈనెల 29న మంగళవారం వరికుంటపాడు మండలం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడం గురించి పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమీక్షించారు. సీఎం, డిప్యూటీ సీఎం బహిరంగ సభకు కనిగిరి నుండి తరలివచ్చే టిడిపి శ్రేణులు, ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.