ఉరవకొండ: సబ్సిడీతో రబీ సాగుకు ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేయాలని వైయస్సార్సీపి నాయకులు ఎమ్మార్వోకు వినతి
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల ఎమ్మార్వో జయశ్రీ గారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మార్వో గారిని కలిసి రైతుల సమస్యలను వివరించడం జరిగింది. రబీ సీజన్లో వజ్రకరూరు మండల రైతులకు పప్పు శనగ తెల్ల కుసుమలు మరియు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు 80% రాయితీతో రైతులకు ఇవ్వాలని కోరడమైనది. అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాల్లో పప్పుచెనగ సాగు అవుతుందీ అందులో ప్రధానంగా ఉరవకొండ ప్రాంతంలో వజ్రకరూరు మండలంలో ఈ పప్పు సెనగ పంటను పండించడం జరుగుతుంది. రబీ సీజన్ మొదలైనప్పటికీ రైతులకు విత్తనాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు.