ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెలుగుప్ప వజ్రకరూర్ విడపనకల్లు ఉరవకొండ కూడేరు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులు తమ తమ పరిధిలోని గ్రామాల్లోనూ మండలాల్లోనూ గురువారం ఉదయం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బెలుగుప్ప మండల పరిధిలోని సీర్పీ,, ఎలగల వంక గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు ప్రియాంక, సరిత లతో కలసి బెలుగుప్ప మండల జడ్పిటిసి అభ్యర్థి మీనుగ నరేంద్ర బాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.