రాయదుర్గం: సమాచార హక్కు ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులుగా బండి విక్రమ్
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు జరిగేలా ప్రతీఒక్కరూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని సమచార హక్కు ఐక్యవేదిక వ్యవస్థాపకులు లాల్య నాయక్ అన్నారు. ఆదివారం రాయదుర్గంలో నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా బండి విక్రమ్, గౌరవ అధ్యక్షులుగా పూజారి మారుతి, ఉపాధ్యక్షులుగా బడిగే రామకృష్ణ, నాయకుల మల్లికార్జున, శివప్రసాద్, జనరల్ సెక్రటరీగా వన్నలి కృష్ణ, ట్రెజరర్ గా అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీగా పూల చిన్న నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కురుబ తిప్పేస్వామి, ఈసీ మెంబర్లుగా నగేష్, చంద్రశేఖర్ లు ఎంపికయినట్లు ఆయన ప్రకటించారు. నియామక పత్రాలు అందజేశారు.