రాయదుర్గం: బొమ్మనహాల్ మండలంలో ఉద్రిక్తత
తగిన పరిహారం ఇవ్వకుండా బలవంతంగా పవర్ గ్రిడ్ టవర్లు నిర్మాణ పనులు చేపట్టడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బొమ్మనహల్ మండలంలోని ఎల్ బి నగర్ సమీపంలో భారీ పోలీసు బందోబస్తు మద్య టవర్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు రావడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కర్నాటక సహా ఇతర ప్రాంతాల్లో ఎకరానికి రూ. 12 లక్శలు పరిహారం ఇచ్చి ఇక్కడ మాత్రం కేవలం రూ. 4 లక్షలు ఇస్తామంటున్నారని రైతులు తెలిపారు. ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా పంటలున్న భూమిలో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా టవర్ ల నిర్మాణం చేపట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.