కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుడిగా సైమన్ కమిషన్ ఎదురొడ్డి పోరాడిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పని చేశారన్నారు.