ఉరవకొండ: జల్లిపల్లి లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగైన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన రైతు సాధికారిక సంస్థ రాష్ట్ర బృందం
అనంతపురము జిల్లా కూడేరు కాంగ్రెస్ పార్టీ మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగుచేసిన వ్యవసాయ తోటలను శుక్రవారం రైతు సాధికార సంస్థ అనంతపురము జిల్లా చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శ్రీ లక్ష్మా నాయక్ గారి సహకారంతో, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ) బృందంతో రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు (డీపీఎంయూ), రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లు, డీపీపీలు, వైఆర్ఎఫ్లు మరియు సిబ్బంది ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ రైతు మామిడి తోటను బృందం సందర్శించింది.