కొండపి: మౌలాబీ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది: మాజీమంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం సింగరాయకొండలోని ఓ ప్రైవేటు నవోదయ పాఠశాలలో మౌలాబి కుమారుడు తోషిక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతి పై అనుమానం వ్యక్తం చేసిన మౌలాబి 7 నెలలగా న్యాయపోరాటం చేస్తుంది. న్యాయం జరగాలంటూ రెండు రోజుల క్రితం విషద్రవం తగిన మౌలాభి హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన మాజీమంత్రి సురేష్.. తక్షణమే ప్రభుత్వం మౌలాబీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.