రాయదుర్గం: పూలచర్ల వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేసిన MEIL సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కణేకల్ మండలం పూలచెర్లలో MEIL సంస్థ 25 ఎకరాల్లో 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను 6 నెలల్లో పూర్తి చేసింది. దీనిని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. ఇది రాయలసీమలోనే వేగంగా పూర్తయిన ప్లాంట్ అని, రైతులకు లబ్ధి చేకూరుతుందని, భవిష్యత్తులో విశాఖ, దావణగిరికి విద్యుత్ ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.