రాయదుర్గం: ప్రమాణ స్వీకరానికి ముందే తాగనీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ మురళీకృష్ణ
రాయదుర్గం పట్టణంలో తాజాగా గెలుపొందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా 32వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన నాయకుల మురళీకృష్ణ ఎన్నికల ప్రచారంలో స్థానికులు చెప్పిన నీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చులతో పాపట్ల బావి వీధిలో మంగళవారం బోరు వేయించారు. బోరులో సమృద్ధిగా నీరు పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మోటారు బిగించి, ట్యాంకులు ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తానని మురళీకృష్ణ తెలిపారు. గెలిపించిన వార్డు ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా నన్నారు.