రాయదుర్గం: అప్పుల బాధతో గుమ్మగట్ట లో వ్యక్తి ఆత్మహత్య
గుమ్మఘట్ట మండల కేంద్రానికి చెందిన కురుబ రవికుమార్ (32) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ చిన్నరాయుడు తెలిపిన వివరాల మేరకు ఎలక్ట్రికల్ షాపు నిర్వహించే రవికుమార్ ఇంటి నిర్మాణం, వ్యాపారం కోసం సుమారు రూ.20 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం తోచక గ్రామ శివారులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. రాత్రి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.