యర్రగొండపాలెం: రోడ్ల అధ్వానంగా ఉండడంతో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన స్థానిక ప్రజలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండురివారి పాలెం లో ప్రధాన రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి గుంతల మయంగా మారాయి. గ్రామస్తులు రహదారిపై నిలిచిన వర్షపు నీటిలో వరి నాట్లు వేసి అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులుగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.