మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం రహదారిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న శుక్రవారం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కారు శ్రీశైలం దర్శనం ముగించుకొని తిరిగి మహానందికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్లో ఉన్న ఇద్దరికీ గాయాలు కాగా బస్సులోని ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో వారు ఊపిరిపించుకున్నారు. కారు ముందు భాగం ధ్వంసం కాగా బస్సు ముందు భాగం కూడా దెబ్బతింది.