మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బద్వీడు సుబ్రహ్మణ్యం కుమారుడు మోహన్ ఆకస్మికంగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు మోహన్ పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు