మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో ఫిబ్రవరి 25వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు ఘంటవానిపల్లి గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. ఫీడర్ కెనాల్ ముఖ్యమంత్రి హెలిపాడ్ సభ ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కాన్వాయ్ వెళ్లే గ్రామాలలో రోడ్లు విద్యుత్ లైన్లు చెట్లు అడ్డంకి లేకుండా చూసుకోవాలని తెలిపారు.