ఉరవకొండ: గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల గుర్తింపు కార్డులు పంపిణీ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల గుర్తింపు కార్డులను పార్టీ సీనియర్ నాయకులు పంపిణీ చేశారు. మండలంలోని తగ్గుపర్తి రామసాగరం ఎర్రగుడి తదితర గ్రామాల్లో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు తగ్గుపర్తి గ్రామంలో అనుబంధ సంఘాల గుర్తింపు కార్డులను సభ్యులకు పంపిణీ చేసి పార్టీ అభ్యున్నతి లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామసాగరం ఎర్రగుడి గ్రామాల్లో పార్టి సీనియర్ నాయకులు గోవిందరెడ్డి, కేశవరెడ్డి, అంగడి ఎర్రి స్వామి మాజీ సర్పంచ్ అనిత, వన్నూరుస్వామిలు పంపిణీ చేశారు.