యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో ఓయ్ ఇంట్లో పూజ గదిలో కలకలం రేపిన త్రాచుపాము
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం నాసర్ రెడ్డి నగర్ లో త్రాచు పాము కలకలం రేపింది. ఓ ఇంటి పూజ గదిలోకి అకస్మాత్తుగా ప్రవేశించిన పామును చూసిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న స్నేక్యాచార్ మల్లికార్జున పామును పట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న త్రాచుపామును అడవి ప్రాంతంలో విడిచిపెడతామన్నారు.