కనిగిరి: రాష్ట్ర శాసనసభను సందర్శించిన కనిగిరి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు
కనిగిరి:రాష్ట్ర శాసనసభను సందర్శించే అవకాశాన్ని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోనత పాఠశాల విద్యార్థులకు కల్పించారు. బుధవారం రాష్ట్ర శాసనసభను విద్యార్థులు సందర్శించగా, వారికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ కార్యక్రమాలు, పనితీరును వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ శాసనసభ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు.