రాయదుర్గం: పట్టణంలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు
రాయదుర్గం పట్టణంలో టిప్పూ సుల్తాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆత్మకూరు వీధిలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు ఖజీ సైఫుల్లా, సామాజిక సేవకులు నాదాలియ, మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు టిప్పూ సుల్తాన్ అని కొనియాడారు. మైసూరు పులిగా పేరుగాంచిన ఆయన దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.