కనిగిరి: టిడిపి కార్యాలయ నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ పనులు ఎంతవరకు వచ్చాయో స్వయంగా ఆయన పరిశీలించి వివరాలు సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణ పనులు ప్లాన్ ప్రకారం , అన్ని వస్తువులు ఉండేలా పూర్తి చేయాలని, పనులు నాణ్యతగా, సమయానికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.