రాయదుర్గం: కుష్ఠు వ్యాధి లేని సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే
కుష్ఠు వ్యాధి లేని సమాజమే లక్ష్యంగా బొమ్మనహాల్ మండలంలోని పలు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఉంతకల్లు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింట వెళ్లి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శరీరంపై ఎక్కడైనా స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే వెంటనే స్థానిక ఆసుపత్రి లో వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరు నెలలపాటు మందులు వాడితే కుష్ఠు వ్యాధి నయమవుతుందని తెలిపారు.