రాయదుర్గం: పట్టణంలో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన అధికారులు
వినాయక నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ సూర్యప్రతాప్ తో కలసి పట్టణంలోని 6 ప్రాంతాలను పరిశీలించి నాన్ చెరువును ఎంపిక చేశారు. అక్కడ కుంట తవ్వి ట్యాంకర్లతో నీరు నింపుతామన్నారు. చిన్న విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేయాలని కోరారు. పెద్ద విగ్రహాలకు కణేకల్ HLC కాలువలో నిమజ్జన ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.