రాయదుర్గం: బళ్ళారి లో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, రాయదుర్గం ఎమ్మెల్యే
బళ్లారి: నగరంలోని ప్రముఖ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వెస్ట డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాయదుర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, బళ్లారి ఎంపీ పార్థసారథి, తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కాలవ భరత్, డాక్టర్ ఆకర్ష్ తెలిపారు.