ఉరవకొండ: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని వైయస్సార్సీపి పిఎసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు, రాజకీయ విమర్శలకు స్థానం ఉండాలి తప్ప, దాడులకు హింసకు చోటు ఉండకూడదు.రాజకీయ నాయకులపై దాడులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు.