రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినందుకు ఉపకులపతి జ్యోతి కుమార్ కుకృతజ్ఞత తెలిపిన ఉద్యోగులు
అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం 12 గంటల 50 నిమిషాల సమయంలో నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘం నాయకులు ఉపకులపతి జ్యోతి కుమార్ ను కలిసి ప్రమోషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో 17 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని రానున్న రోజుల్లో యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రభుత్వ అనుమతితోనే నాన్ టీచింగ్ స్టాఫ్ కు ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో టీచింగ్ ఫ్యాకల్టీ ని కూడా ఎక్కువమంది తీసుకుంటున్నామని ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు.