ఉరవకొండ: విరుపా పల్లి వద్ద నీట మునిగిన కంది పంట, పంట నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని విరుపాపల్లి కోనాపురం గ్రామాల వద్ద హంద్రీనీవా కాలువల వెంబడి వస్తున్న నీటిని కోనాపురం చెరువుకు పొలాల గుండా విడుదల చేయడంతో పలువురి రైతుల పొలాల్లో నీరు నిలిచి పంట నష్టం చేకూర్చాయని రైతులు వాపోతున్నారు. బుధవారం విరుపా పల్లి గ్రామానికి చెందిన రైతులు వేణుగోపాల్ రెడ్డి, త్రయంబక రెడ్డి, రమణా తదితరులు తమ కంది పంట పొలాల గుండా కోనాపురం చెరువుకు నీరు వదలడం మూలంగా తమకు పంట నష్టం చేకూరిందని వాపోయారు. పంట నష్ట పరిహారం చెల్లించాలని రెవిన్యూ అధికారులకు విన్నవించామని రైతులు పేర్కొన్నారు.