రాయదుర్గం: ఆదిగానిపల్లి రచ్చుమర్రి గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్న జెడ్పిటిసి ఆదినారాయణ
ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కణేకల్లు జెడ్పిటిసి గా గెలుపొందిన ఆదినారాయణ, ఎంపిపి ఎంపిపి అభ్యర్థి గా గెలుపొందిన హేమావతి భర్త, టిడిపి నేత కళేకుర్తి సుదర్శన్ హామీ ఇచ్చారు. సోమవారం ఆ గ్రామానికి వచ్చిన వారికి స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.