రాయదుర్గం: వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి : సీఐ దేవానంద్
వినాయక ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ సూచించారు. బుధవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సూర్యప్రతాప్ అధ్యక్షతన ఉత్సవ కమిటీ ల నిర్వాహకులు, మున్సిపల్, ఎలక్రిసిటి, పోలీసు ఫైర్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్ట మెదలు నిమజ్జనం వరకూ పోలీసు అధికారుల సూచనల మేరకు నిబంధనలు పాటించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు, డిఈ సురేష్ పాల్గొన్నారు.