ఉరవకొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు బెలుగుప్ప విద్యార్థి హరి సాద్విక్
అనంతపురం జిల్లా బెలుగుప్పమండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి హరిసాద్విక్ ఈనెల 13 నుండి 16 వరకు తిరుపతి జిల్లా పుల్లంపేటలో జరుగుతున్న జూనియర్ సాఫ్ట్బాల్ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి వెళ్లడం జరిగిందని పీడి గోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. గత నెల 24 న ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయి ఎంపికలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు హరిసాద్విక్ ను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ఎంపికచేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హరి సాద్విక్ ను పాఠశాల హెచ్ఎం వెంకట ప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ రుద్రయ్య అభినందించారు.