రాయదుర్గం: వైసిపి ని గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది : ఎమ్మెల్యే
రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో పొరపాటున వైసిపి ని గెలిపిస్తే ఆ వార్డులో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అన్నారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని 22 వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో తాము తెచ్చిన నిధులు కూడా వైసిపి పాలకవర్గం ఖర్చు చేయలేదనని చెప్పారు. వైసిపి నాయకులకు పైసా నిధులు తేవడం చేతకాదని, అభివృద్ధి నిరోధకులని ఎద్దేవా చేశారు. వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.