రాయదుర్గం: పట్టణంలో రెండు రోజులు తాగునీరు సరఫరాలో అంతరాయం : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
కణేకల్ క్రాస్ వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి రాయదుర్గానికి నీరు సరఫరా చేసే పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే సరఫరా యథావిధిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రజలు సహకరించి నీటిని పొదుపుగా వాడాలని కోరారు.