కనిగిరి: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కనిగిరిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం పట్ల కనిగిరిలోని బీసీలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సుగుణవతమ్మ సెంటర్ నందు బుధవారం పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో బీసీలు, టిడిపి శ్రేణులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి అధ్యక్షుడు ఫిరోజ్ మాట్లాడుతూ.. బీసీలకు సామాజిక న్యాయం దిశగా సీఎం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా బీసీల్లో హర్షం వ్యక్తం అవుతుందన్నారు.