మచిలీపట్నం: మచిలీపట్నం మేయర్ సీటు నాకే ఇవ్వాలి: బుల్లెట్ ధర్మారావు డిమాండ్
మచిలీపట్నం మేయర్ సీటుతో పాటు 10 కార్పొరేటర్ సీట్లను రాధా-రంగా మిత్ర మండలికి కేటాయించాలని ఆ సంస్థ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కోరారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపులో తమ పాత్ర ఉందని పేర్కొన్న ఆయన, తనకు అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.