రాయదుర్గం: వింత రోగాలతో మృత్యువాత పడుతున్న కోళ్లు, ఆందోళనలో పెంపకందారులు
బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో కోళ్లు వరుసగా మృత్యువాత పడటంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన దుర్గేష్ సుమారు 50కి పైగా నాటుకోళ్లు పెంచుతుండగా ఇటీవల 46 కోళ్లు వరుసగా మరణించాయని తెలిపారు. విషయాన్ని పశువైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, చలి ప్రభావంతో మృతి చెంది ఉంటాయని తెలిపారు. రాత్రివేళల్లో వెచ్చని గదుల్లో, గాలి దూరని గూళ్లలో కోళ్లను ఉంచాలని పెంపకందారులకు సూచించారు.