ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పై విమర్శలు చేయడం వైసిపి నాయకులకు తగదు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ వైసీపీ ఇన్చార్జి విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి విమర్శలు చేయడం తగదని బెలుగుప్ప మండల టిడిపి నాయకులతో కలసి పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున ఖండించారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎలగల వంక గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రణయ్ రెడ్డి విమర్శలను ఖండించారు. వైసిపి ప్రభుత్వ పాలనలో మీరు ఏమి చేశారని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.