దర్శి: దర్శి పట్టణంలోని శివరాజు నగర్ సాయి నగర్ కాలనీలలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆందోళన
Darsi, Prakasam | Sep 12, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శివరాజు నగర్ సాయి నగర్ కాలనీలలో గత పది రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో దర్శి కురిచేడు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధికారులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు.