రాయదుర్గం: సంజీవరాయుని కోటలో ముగ్గురు మృతితో తీవ్ర విషాదం
డీ.హీరేహాల్ మండలం సంజీవరాయుని కోట గ్రామంలో గురువారం జరిగిన వరుస విషాద ఘటనలు గ్రామాన్ని కలచివేశాయి. గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి పశువులకు గడ్డి తేవడానికి కోసం వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు వరలక్ష్మి, మల్లికార్జున రెడ్డి హుటాహుటిన కారులో బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రి మల్లికార్జున రెడ్డి, కారు డ్రైవర్ చాంద్ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి వరలక్ష్మి, చిన్నాన్న పురుషోత్తం రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పాము కాటుకు గురైన పవన్ కుమార్ రెడ్డి కూడా మృతి చెందాడు.